పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. వందలాది మినీ అంగన్వాడీలు ఏర్పాటు చేసి... వాటి బాగోగులు విస్మరించినందుకు నిరసన చేపట్టారు. వేతన బకాయిలు, అద్దెలు, ఇతర బిల్లులు విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
కలెక్టరేట్ వద్ద మినీ అంగన్వాడీ కార్యకర్తల ధర్నా
తమ సమస్యలు పరిష్కరించాలంటూ... మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు.
ఏలూరు కలెక్టరేట్ వద్ద మినీ అంగన్వాడీ కార్యకర్తల ధర్నా