ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయా డెయిరీ రైతులకు శుభవార్త - latest news on farmers

కరోనా నేపథ్యంలో విజయా డైయిరీ పాడి రైతులకు చెల్లించే పాల ధరను లీటరుకు 60 నుంచి 65 రూపాయలకు పెంచుతూ పాలక వర్గం నిర్ణయం తీసుకుంది. మరోవైపు రైతులకు 20 కోట్ల రూపాయల బోనస్ కూడా ఇవ్వడానికి సభ్యులు అంగీకరించినట్లు విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు.

milk price increased to vijya dairy farmers
విజయా డైయిరీ రైతులకు శుభవార్త

By

Published : Mar 31, 2020, 5:19 PM IST

పాల ధర పెంపుపై మాట్లాడుతున్న ఛైర్మన్​

కరోనా నేపథ్యంలో రైతులకు న్యాయం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. విజయవాడ వన్ టౌన్​లోని డెయిరీ కార్యాలయంలో పాలక మండలి సమావేశం నిర్వహించారు. రైతులకు చెల్లించే పాల ధరను లీటరుకు 60 నుంచి 65 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. 60 ఏళ్లుగా కృష్ణా మిల్క్ యూనియన్​ని నమ్ముకుని పాలు అందిస్తున్న రైతులను ఆదుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఫలితంగా యూనియన్​పై 25 కోట్ల భారం పడుతుందని...అయినా రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టకుని..పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందన్నారు. మరోవైపు రైతులకు 20 కోట్ల రూపాయల బోనస్ కూడా ఇవ్వడానికి సభ్యులు అంగీకరించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details