ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మమ్మల్ని పంపించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం' - పశ్చిమగోదావరిలో వలస కూలీల నిరసన

సొంత ప్రాంతాలకు పంపించకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల బాలయోగి గురుకుల పాఠశాలలో వలస కూలీలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో వలస కూలీలందరినీ పంపిస్తున్నా ..తమను పంపించే విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

migrants protest in dwaraka tirumala to send back to their native places
స్వస్థలాలకు పంపాలని ద్వారకా తిరుమలలో వలస కూలీల ఆందోళన

By

Published : May 17, 2020, 7:38 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల బాలయోగి గురుకుల పాఠశాలలో ఆశ్రయం పొందిన వలస కూలీలు ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపాలంటూ డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.

లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు స్థానిక బాలయోగి గురుకుల పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వలస కూలీలను సొంత ప్రాంతాలకు పంపిస్తున్న నేపథ్యంలో తమను కూడా పంపాలంటూ రెండు రోజుల క్రితం ఆందోళనకు దిగారు.

అప్పుడు స్పందించిన రెవిన్యూ అధికారులు కొందరినే పంపారు. మిగతా 53 మంది ఇక్కడే ఉన్నారు. అధికారులు తమను పంపే విషయంలో జాప్యం చేస్తున్నారని మళ్లీ ఆందోళనకు దిగారు. రెవిన్యూ అధికారులు స్పందించి అనుమతి ఇవ్వగా... వారిని 2 బస్సుల్లో సొంత ప్రాంతాలకు తరలించారు.

ఇదీ చదవండి:

వరంగల్​ టు ఒడిశా వయా... క్వారంటైన్​..!

ABOUT THE AUTHOR

...view details