ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కూలీలు... సుదీర్ఘ ప్రయాణం - journey of migrant laborers

లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్వస్థలాలకు చేరుకునేందుకు మండుటెండల్లో కాలినడకన సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి ఎస్సై విశ్వనాథ బాబు.. తమ ప్రాంతంలో వెళ్తున్న వారిని త్వరితగతిన గుర్తించి.. వాహనాలను అనుమతించారు.

journey of migrant laborers
వలస కూలీల...సుధీర్ఘ ప్రయాణం

By

Published : May 16, 2020, 10:30 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో.. రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద సొంత ప్రాంతాలకు తరలి వెళ్తున్న వలస కూలీలను పోలీసులు తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే విడిచి పెట్టారు. మినీ వ్యాన్లు, బస్సులో వెళ్తున్న కూలీలను మొదటగా తెలంగాణ సరిహద్దు వద్ద తనిఖీ చేశారు.

ఎక్కువ వాహనాలను ఒకేసారి అనుమతించిన కారణంగా... ఒక్కసారి వేలాది మంది తరలివచ్చారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. జీలుగుమిల్లి ఎస్సై విశ్వనాథ బాబు త్వరితగతిన కూలీల వివరాలు నమోదు చేస్తూ.. వాహనాలను ముందుకు అనుమతించారు.

ABOUT THE AUTHOR

...view details