ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలినడకనే పయనం.. గమ్యం చేరడమే లక్ష్యం - పశ్చిమగోదావరి జిల్లాలో వలస కూలీల కష్టాలు

లాక్​డౌన్​తో పనులు లేక, సొంత ఊళ్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక వలస కూలీలు నరకయాతన అనుభవిస్తున్నారు. కాలినడకన వేల కిలోమీటర్ల దూరం నడుస్తూ ముందుకు సాగుతున్నారు. చెన్నై నుంచి ఒడిశాకు బయలుదేరిన వలస కార్మికులు పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకున్నారు.

migrant people problems with lockdown in westgodavari district
దాతలు ఇచ్చిన ఆహారాన్ని తింటున్న వలసకూలీలు

By

Published : May 9, 2020, 8:34 PM IST

లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేక చిక్కుకుపోయిన వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. చెన్నై నుంచి ఒడిశాలోని కోరాపుట్​కు కాలినడకన వెళ్తున్న కార్మికులు పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకున్నారు. వీరికి కొందరు దాతలు ఆహార పొట్లాలు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

రహదారుల వెంబడి హోటళ్లు తీయని కారణంగా... కాలినడకన వెళ్తున్న వారికి ఆహారం, తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు తమను సొంత గ్రామాలకు పంపించడానికి చర్యలు చేపట్టలేదని వలసకార్మికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details