ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొట్ట చేతపట్టుకుని.. కాళ్లను నమ్ముకుని.. తిరుగు పయనం - రాష్ట్రవ్యాప్తంగా వలస కూలీలు కష్టాలు

పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం వలస వెళ్లిన కూలీలు.. పొట్టచేతపట్టుకుని అర్ధాకలితో, మండే ఎండలో, కాళ్లను నమ్ముకుని స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. మార్గమధ్యంలో దాతలు పెట్టిన ఆహారం తింటూ బొబ్బలు కట్టిన కాళ్లతోనే ముందుకు సాగుతున్నారు. అధికారులు స్పందించి తమను స్వస్థలాలకు చేర్చాలని వేడుకుంటున్నారు.

migrant labours returns home
పొట్ట చేతపట్టుకుని.. కాళ్లను నమ్ముకుని.. వలస జీవుల తిరుగు పయనం

By

Published : May 7, 2020, 7:29 PM IST

పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం వలస వెళ్లిన కూలీలు.. పొట్టచేతపట్టుకుని అర్ధాకలితో, మండే ఎండలో, కాళ్లను నమ్ముకుని స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. బిహార్, ఒడిశా, కోల్​కతా, ఆంధ్రప్రదేశ్​ల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు వెళ్లినవారు తిరుగుపయనమయ్యారు.

ఒకపక్క లాక్ డౌన్ కారణంగా పనుల్లేవు.. మరోపక్క ఇంటి అద్దె చెల్లించాలని యజమానుల ఒత్తిడులు, ఇంకోపక్క డబ్బుల్లేక అర్ధాకలితో సహజీవనం. ఇవన్నీ భరించలేక కాలినడకనే ఇళ్లకు బయలుదేరారు. మార్గమధ్యంలో దాతలు పెట్టిన ఆహారం తింటూ బొబ్బలు కట్టిన కాళ్లతోనే ముందుకు సాగుతున్నారు. వలస కూలీలను ఆదుకుంటామని ప్రభుత్వాలు చెప్తున్న మాటలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని అసహనం వ్యక్తంచేస్తున్నారు.

ఇవీ చదవండి.. వలస కార్మికులను తరలించిన బస్సుకు ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details