ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరిహద్దులకు వందలాదిగా వలస కూలీలు.. పంపించాలంటూ వేడుకోలు - ఏపీ సరిహద్దులకు వలస కూలీలు

వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నా... క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడంలేదు. తెలంగాణ నుంచి వందల సంఖ్యలో వలస కూలీలు రాష్ట్ర సరిహద్దుకు చేరుకుంటున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసి వలస కూలీలను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. సమాచారం లేదని కొంత మందిని అడ్డుకుంటున్నారు.

రాష్ట్ర సరిహద్దుకు వందల సంఖ్యలో వలసకూలీలు
రాష్ట్ర సరిహద్దుకు వందల సంఖ్యలో వలసకూలీలు

By

Published : May 3, 2020, 12:54 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్దనున్న రాష్ట్ర సరిహద్దు వద్దకు తెలంగాణ నుంచి వందల మంది వలస కూలీలు చేరుకున్నారు. వారందరికీ థర్మల్ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయిస్తున్న పోలీసులు.. ఆ తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. మరి కొందరిని మాత్రం వివిధ కారణాలతో నిలిపేస్తున్నారు. తమను స్వస్థలాలకు చేర్చాలని కూలీలు కోరుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట శివారులోనూ రాష్ట్రానికి చెందిన వలస కూలీల అవస్థలు పడుతున్నారు. అశ్వారావుపేట చెక్‌ పోస్టు వద్ద తెలంగాణ నుంచి ఏపీ వైపు వస్తున్న కూలీలను రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి పత్రాలున్నా సరే... తమకు సమాచారం లేదని పోలీసులు అంటున్నారు. పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతూ కూలీల పడిగాపులు పడుతున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఖమ్మం జిల్లాలోని ఇటుక బట్టీల్లో పనిచేయడానికి వీరంతా వలసవెళ్లినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details