వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు పయనమయ్యారు. శ్రీకాకుళం, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం చెన్నై, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో పనుల కోసం వెళ్లిన వారు.. లాక్ డౌన్ కారణంగా పనులు నిలిచిపోయి తిరుగుముఖం పట్టారు. చేతిలో సొమ్ములు లేక కాలినడకన పశ్చిమగోదావరి జిల్లా జాతీయ రహదారి వెంబడి నడిచి వెళుతున్నారు. నడిచీ నడిచీ కాళ్ళు బొబ్బలు కట్టి ఎక్కువ దూరం నడవలేక పోతున్నామని వాపోతున్నారు. దాతలెవరూ తమను ఆదుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి సొంత గ్రామాలకు వెళ్లే ఏర్పాట్లు చేయాలని వేడుకున్నారు.
ఇళ్లకు చేరేందుకు వలస కార్మికుల పాదయాత్ర - వలస కార్మికుల పాదయాత్ర
పనులకోసం వేరే ప్రాంతాలకు వెళ్లి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన వలస కార్మికులు.. స్వస్థలాలకు తిరుగుపయనమయ్యారు. రవాణా సౌకర్యాలు లేనందున కాలినడకనే బయలుదేరారు. అధికారులు స్పందించి తమను సొంత గ్రామాలకు చేర్చే ఏర్పాట్లు చేయాలన్నారు.
ఇళ్లకు చేరేందుకు వలస కార్మికుల పాదయాత్ర