పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వలస కూలీల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వలస కూలీలు పోలీసులపై రాళ్లు, సీసాలతో దాడి దిగడంతో పోలీసులు సైతం లాఠీచార్జ్ చేశారు. తమ రాష్ట్రాలకు పంపాలని ఉదయం నుంచి ఇతర రాష్ట్రాల వలస కూలీలు కొవ్వూరు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. సుమారు 300 పైగా బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు చెందిన వలస కూలీలు ధర్నాకు దిగారు.
కొవ్వూరులో.. పోలీసులపై వలసకూలీల రాళ్ల దాడి - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు
09:24 May 04
పోలీసులపై వలసకూలీల దాడి
ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు లేవని, అనుమతులు వచ్చాక పంపుతామని పోలీసులు రెవెన్యూ అధికారులు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో సహనం కోల్పోయిన వలస కూలీలు పోలీసులపై దాడికి దిగారు. వలస కూలీలపై పోలీసులు సైతం లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. వలస కూలీలంతా గోదావరి నదిలో ఇసుక కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి ఎలాంటి వాహన సౌకర్యం అనుమతులు రాకపోవడంతో అధికారులు వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేయలేదు. నడిచి వెళతామని కూలీలు పట్టుపట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఇదీ చదవండి : 'లాక్డౌన్ ఉల్లంఘించిన వైవీ సుబ్బారెడ్డిపై చర్యలేవీ?'