జార్ఖండ్‌కు చెందిన సుమారు వందమంది కార్మికులు చెన్నైలోని అపోలో టైర్ కంపెనీలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో వారందరూ ఉపాధి కోల్పోవడంతో కాలినడకన స్వగ్రామానికి బయలుదేరారు. తినడానికి తిండి లేక, అద్దెలు కట్టేందుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. స్వస్థలాలకు చేరేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సదుపాయాలు లేక సొంతూరు బాటపట్టారు - పశ్చిమ గోదావరి జిల్లాలో వలస కూలీల ఇబ్బందులు
లాక్డౌన్ సమయంలో వలసకూలీల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫలితంగా వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చెన్నైలో పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన సుమారు వందమంది కార్మికులు కాలినడకన స్వస్థలానికి బయలుదేరారు.
మార్గమధ్యంలో సేదతీరుతున్న వలస కూలీలు