పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో సుమారు రెండు వందల మంది వలస కూలీలు ఉపాధి పనులు కోసం మొక్కజొన్న ఫ్యాక్టరీ లో పనిచేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు.
తమ ప్రాంతానికి పంపాలంటూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ లింగపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. బీహార్ కు వెళ్లే రైళ్లు ఖాళీగా లేవని చెప్పిన అధికారులు.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.