పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో అన్నను తమ్ముడు కత్తితో పొడిచి చంపాడు. అత్తిలిలోని శాఖా గ్రంథాలయ వద్ద ఈ ఘటన జరిగింది.
అత్తిలిలో అన్నను చంపిన తమ్ముడు - అత్తిలిలో హత్య
కుటుంబ తగాథాలు ఓ మనిషి ప్రాణం తీశాయి. తల్లిదండ్రులను వేధిస్తున్నాడన్న కారణంతో అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన అన్న అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామానికి చెందిన బందుల సురేష్ తరచూ తల్లిదండ్రులు వేధించడంతో పాటు కొడుతుండేవాడు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాజాగా వీరిద్దరి మధ్య శాఖ గ్రంధాలయం ఆవరణలో ఘర్షణ చెలరేగింది. మహేష్.. సురేశ్‌పై కత్తితో దాడికి తెగబడ్డాడు. తీవ్రగాయాలతో సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్, తణుకు సీఐ చైతన్య కృష్ణ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుడి తల్లి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించడంతో నిందితుడు పరారయ్యాడని సీఐ చైతన్య కృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి:Jagan Polavaram Tour: 19న సీఎం జగన్ పోలవరం పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు