పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో ప్రమాదవశాత్తు చెరువులో పడి నక్క అన్నవరం అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మంగళవారం తెల్లవారుఝామున ఉదయపునడక చేసేందుకు బయటికి వచ్చి.. తిరిగి ఇంటికి చేరలేదు. బంధువులు దెందులూరు, ఏలూరు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఇంటికి సమీపంలోనే ఉన్న చెరువులో వ్యక్తి మృతి చెందటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసి.. అన్నవరంగా గుర్తించారు. ఎస్సై కుమారస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి - west godavari
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలిలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు.
వ్యక్తి మృతి