ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

mega vaccination: తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోన్న టీకా పంపిణీ - కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ సాగుతోంది. ఐదు ఏళ్లలోపు వయసు గల పిల్లల ఉన్న తల్లులు, 45 సంవత్సరాలుపైబడిన వారికి టీకా ఇస్తున్నారు.

mega vaccination
తూర్పుగోదావరి జిల్లాలో మెగా వ్యాక్సినేషన్​

By

Published : Jun 20, 2021, 3:08 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో మెగా వ్యాక్సినేషన్​ కొనసాగుతోంది. ఈ సందర్భంగా అమలాపురం డివిజన్​లో టీకా పంపిణీ కేంద్రాలకు జనం పొటెత్తారు. డివిజన్ వ్యాప్తంగా మొత్తం 41 వేల మందికి కరోనా టీకా ఇచ్చేెందుకు ఏర్పాట్లు చేశామని... ఈ మేరకు 40 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ డీఎంహెచ్​వో డా. సీహెచ్ పుష్కరరావు వెల్లడించారు. ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్న తల్లులు, 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్​ ఇస్తున్నట్లు చెప్పారు.

కొత్తపేట నియోజకవర్గంలో..

కొత్తపేట నియోజకవర్గంలో కొవిడ్ వ్యాక్సినేషన్​ కార్యక్రమం జోరుగా సాగుతోంది. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున వచ్చి టీకా తీసుకుంటున్నారు.

పి. గన్నవరం నియోజకవర్గంలో..

పి. గన్నవరంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్​ కేంద్రం వద్ద టీకా పంపిణీ ప్రశాంతంగా జరుగుతోంది. అంతకుముందు జనాలు భౌతిక దూరం మరిచి ఒకరినొకరు నెట్టుకున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికి టీకా వేస్తామని.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన మెగా వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను విజయవంతం చేసి వైరస్​ వ్యాప్తిని నిర్మూలిద్దామన్నారు.

ఇదీ చదవండి.. :VACCINATION: సెల్​ఫోన్​లో మాట్లాడుతూ.. యువతికి రెండుసార్లు టీకా!

ABOUT THE AUTHOR

...view details