గ్రామ సచివాలయంలో మీ సేవా ఆపరేటర్లను అసిస్టెంట్‌గా నిర్మించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద మీ సేవా ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అందించే అన్ని రకాల సేవలను ప్రజలకు అందిస్తూ... ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులను ప్రజలకు అందిస్తూ... 'మీ సేవా'లపై ఆధారపడి ఉన్న కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము ఉద్యోగ భద్రత కోల్పోతున్నామని ఆవేదన చెందారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని మీ సేవా ఆపరేటర్లకు కోరారు.
ఏలూరు కలెక్టరేట్ వద్ద 'మీ సేవా' ఆపరేటర్ల ధర్నా - మీ సేవా ఆపరేటర్ల ధర్నా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద మీ సేవా ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'మీ సేవా' ఆపరేటర్ల ధర్నా