ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెడికో బలవన్మరణం.. ప్రేమ వ్వవహారమే కారణమా!?

ఎంతోమందికి కొత్త జీవితాన్ని ఇవ్వాల్సిన మెడికో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమా... లేదా ఆర్థిక వ్యవహారమా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వైద్య విద్యార్థి ఆత్మహత్య

By

Published : Jul 30, 2019, 12:03 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఓ మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన గుగులోతు పుష్పనాయక్ (23) ఏలూరు సమీపంలో మెడికల్ కళాశాలలో వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం కళాశాలలో రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు జరుగుతున్న రెండు పరీక్షలు రాసి తోటి విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో ఉన్న హాస్టల్ గదికి వెళ్ళాడు. విద్యార్థులందరూ సాయంత్రం బయటికి వెళ్లగా పుష్పనాయక్ మాత్రం ఒక్కడే గదిలో ఉండి ఫ్యాన్ కు దుప్పటితో ఉరేసుకున్నాడు. కాసేపటికి గది వద్దకు వచ్చిన తోటి విద్యార్థులు తలుపులు తీసి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. ఎంతకీ తెరుచుకోకపోవడంతో వెనకవైపు నుంచి గదిలోకి రాగా అప్పటికే పుష్పనాయక్ ఉరివేసుకుని వేలాడుతుండగా విద్యార్థులు అతన్ని కిందకి దింపారు. సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం, ఆర్థిక పరిస్థితే కారణమని తెలుస్తుందని పోలీసులు చెప్పారు. లోతుగా విచారణ చేస్తున్నామని తెలిపారు.వైద్య విద్యార్థి బలవన్మరణం పొందటంతో సహ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు.

ABOUT THE AUTHOR

...view details