ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బకాయి జీతాలు చెల్లించండి.. ఉద్యోగాలు క్రమబద్ధీకరించండి' - వైద్య శాఖ సిబ్బంది సమస్యలపై వార్తలు

ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిరసన చేపట్టారు. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేశారు.

Medical health department staff protest at palakoderu
వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిరసన

By

Published : Oct 27, 2020, 4:25 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిరసన చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికపై పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.

తమను పర్మినెంట్ చేయాలని.. పెండింగ్​లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనను తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details