ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ సిబ్బందికి కోడిగుడ్లు, మాస్కుల పంపిణీ - తణుకులో పంచాయతీ సిబ్బందికి మాస్కుల పంపిణీ

లాక్ డౌన్ విధుల్లో భాగంగా కీలక సేవలు అందిస్తున్న పంచాయతీ సిబ్బందికి తెదేపా నాయకులు అండగా నిలిచారు. వారికి కూరగాయలు, మాస్కులు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.

masks eggs distributed to panchayati staff by tdp leaders at tanuku in west godavari district
పంచాయతీ సిబ్బందికి కోడిగుడ్లు పంపిణీ

By

Published : May 13, 2020, 5:23 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో పంచాయతీ సిబ్బందికి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాస్కులు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న వారికి తమవంతు సాయం అందించినట్లు తెలిపారు.

పంచాయతీ సిబ్బంది అధిక సమయం విధుల్లోనే ఉంటున్నారని.. అలాంటివారికి సరకులు అందజేసి చేయూతనివ్వడం తమ బాధ్యత అని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రోత్సాహంతో వీటిని అందజేసినట్లు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details