పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజీపాడుకు చెందిన రాధికకు తాడేపల్లిగూడెం జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఆకుల పవన్‌తో మూడు నెలల క్రితం వివాహమైంది. పెళ్లైన కొత్తలో వారి కాపురం సాఫీగానే సాగింది. తర్వాత వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించింది. అయినా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో.. అత్తింటి ముందు న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమైంది. అయితే న్యాయం చేస్తామన్న పోలీసుల జోక్యంతో ఆ ఆలోచన విరమించుకుంది.
నా భర్తను అప్పగించండి: వివాహిత వేడుకోలు - జువ్వలపాలెం
మూణ్నాళ్ల ముచ్చటగా మారిన పెళ్లిబంధాన్ని.. నూరేళ్ల అనుబంధంగా మార్చుకోవడం కోసం ఓ వివాహిత రోడ్డెక్కింది. పెళ్లైన మూడు నెలలకే భర్త వదిలేస్తే.. న్యాయం కోసం అత్తింటి ఎదుట పోరాటానికి సిద్ధమైంది.
నా భర్త నాక్కావాలి.. వివాహిత న్యాయ పోరాటం