ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మార్క్​ఫెడ్​ ద్వారా పొగాకు కొనుగోళ్లు చారిత్రాత్మక నిర్ణయం' - markfed md visit jangareddy gudem

పశ్చిమ గోదావరి జిల్లాలో మార్క్​ఫెడ్ ద్వారా సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు సంస్థ ఎండీ తెలిపారు. జంగారెడ్డి గూడెంలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

markfed md
మార్క్​ఫెడ్ ఎండీ

By

Published : Jul 16, 2020, 7:51 PM IST

పొగాకును మార్క్​ఫెడ్ ద్వారా కొనుగోలు చేయటం ఒక చారిత్రాత్మక నిర్ణయమని సంస్థ ఎండీ ప్రద్యుమ్న అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎన్​ఎల్​ఎస్ (ఉత్తర ప్రాంత తేలిక నేలలు) ప్రాంతంలో సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన, ప్రద్యుమ్న, పొగకు వేలాన్ని పరిశీలించారు.

మెుదటి సారిగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగాకు కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో పొగాకు కొనుగోలు చేయాలని మెట్ట ప్రాంత ఎమ్మెల్యేలు కోరిన మేరకు పరిశీలనకు వచ్చినట్లు వెల్లడించారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా... ఈ ఏడాది మార్క్​ఫెడ్ ద్వారా మెుక్కజొన్న, ఇతర పంటలు సైతం కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు.

రైతులు నష్టపోకుండా కొనుగోళ్లు చేసే విధంగా ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, ఎలీజా, తలారి వెంకట్రావు తెలిపారు.

ఇదీ చదవండి:

కరోనాపై పోరుకు రూ. 27 లక్షల విరాళం

ABOUT THE AUTHOR

...view details