పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చాగంటి అంజి అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అంజి భార్య ప్రసవం కోసం 6 నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఇటీవల కాపురానికి రావాలంటూ భార్యపై అతను ఒత్తిడి తెచ్చాడు.
జంగారెడ్డిగూడెంలో వ్యక్తి అనుమానస్పద మృతి - crime news at westgodavari
జంగారెడ్డిగూడెంలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కుటుంబ రావు తెలిపారు.
జంగారెడ్డిగూడెంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ఈ క్రమంలోనే మనస్థాపానికి లోనై.. ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి స్వగ్రామం చాగల్లు మండలం ఉనగట్ల. తాపీ పనితో ఉపాధి పొందుతూ జంగారెడ్డిగూడెంలో స్థిరపడ్డారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఎస్సై కుటుంబ రావు తెలిపారు.
ఇదీ చదవండి: