పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. నిడదవోలు లోని బసివి రెడ్డి పేటకు చెందిన ఆకుల వెంకటరాజు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో గుమాస్తాగా పని చేసేవాడు. విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకటరాజును... తణుకు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో వెంకటరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని తాడేపల్లి గూడెం డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. మృతదేహాన్ని పోలీసులు తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీర్రాజు తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి - పశ్చిమ గోదావరి జిల్లా లో రోడ్డు ప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లా బాదంపూడి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి