Man killed by beating with sticks: పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడులో దారుణం జరిగింది. సారా తయారీ విక్రయాలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నాడనే నెపంతో ఇద్దరు వ్యక్తులు ఒకరిని అత్యంత దారుణంగా కొట్టి చంపారు. గ్రామానికి చెందిన రామకుమార్ చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆ గ్రామంలో పోలీసులు సారా స్థావరాలపై దాడి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చాడని ఇద్దరు వ్యక్తులు రామ్‌కుమార్‌పై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రామకుమార్ని జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామ్‌కుమార్ మృతి చెందాడు. సమాచారం అందకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.
Murder: కర్రలతో కొట్టి వ్యక్తి దారుణ హత్య.. కారణమేంటంటే.. - పూచిక పాడులో కర్రలతో కొట్టి హత్య
Man killed by beating with sticks: పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడులో దారుణం చోటు చేసుకుంది. సారా తయారీ విక్రయాలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నాడనే నెపంతో ఇద్దరు వ్యక్తులు ఒకరిని అత్యంత దారుణంగా కొట్టి చంపారు.
![Murder: కర్రలతో కొట్టి వ్యక్తి దారుణ హత్య.. కారణమేంటంటే.. Man killed by beating with sticks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14183170-51-14183170-1642134993667.jpg)
కర్రలతో కొట్టి దారుణంగా హత్య...కారణమేంటంటే...