man killed a woman: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని సహజీవనం చేస్తున్న మహిళను కొట్టి చంపిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జరిగింది. మొగల్తూరుకి చెందిన నంగిన లక్ష్మి భర్త చనిపోవడంతో కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన నక్కా పోతూరాజుతో ఆదర్శనగర్లో సహజీవనం సాగిస్తోంది. వివాహితుడైన పోతురాజు తరచు మద్యం తాగేందుకు డబ్బుల కోసం లక్ష్మిని కొడుతూ గొడవపడేవాడు.
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని మహిళ హత్య - man killed a woman in the west Godavari
man killed a woman: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని మహిళను కొట్టి చంపిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జరిగింది. పట్టణానికి చెందిన లక్ష్మీ అనే మహిళ భర్తు చనిపోవటంతో అదే గ్రామానికి చెందిన పోతురాజు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. నిందితుడు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక స్పృహ కోల్పోవటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని మహిళ హత్య
ఇదే క్రమంలో స్థానికులు హెచ్చరించినా రాజు తన ప్రవర్తన మార్చుకోలేదు శుక్రవారం మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని లక్ష్మిని తీవ్రంగా కొట్టి నెట్టివేయడంతో తల గోడకు బలంగా తగిలి స్పృహ తప్పింది. స్థానికులు రాజును పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మీని నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన నిందితుడు పోతురాజు కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: