ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొల్లగూడెం వద్ద కాలువలో పడి వ్యక్తి మృతి - కాలువలో పడి వ్యక్తి మృతి

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద పోలవరం కుడికాలువలో పడి... వ్యక్తి మృతి చెందాడు. మేస్త్రీగా పని చేస్తున్న సత్యం అనే వ్యక్తి కాలువలో పడి కొట్టుకుపోతుండగా స్థానికులు గమనించారు.

Man dies falling into canal at Gollagudem in west godavari
గొల్లగూడెం వద్ద కాలువలో పడి వ్యక్తి మృతి

By

Published : Nov 3, 2020, 10:57 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. మండల పరిధిలోని ఉప్పాకపాడు గ్రామానికి చెందిన సత్యం... భవనాల పైకప్పులకు ఇనుప ఊచలు అమర్చడం (ఐరన్ మేస్త్రీ) ద్వారా ఉపాధి పొందుతున్నాడు. రెండేళ్ల క్రితం ఉప్పాకపాడు నుంచి గొల్లగూడెం వచ్చి స్థిరపడ్డారు.

సత్యం కాలువలో పడి కొట్టుకుపోతుండగా... అటుగా వెళ్తున్న రైతులు గమనించి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని భీమడోలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. బోటు సహాయంతో అగ్నిమాపక సిబ్బంది సత్యం ఆచూకీ కోసం గాలించగా... సుమారు 4గంటల తర్వాత గుండంపల్లి సమీపంలో సత్యం మృతదేహాన్ని కనుగొన్నారు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details