ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - man died with current shock updates

పశ్చిమ గోదావరి జిల్లా దుబాచర్లలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

man died with current shock
కరెంట్ షాక్​తో వ్యక్తి మృతి

By

Published : Mar 4, 2021, 1:41 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దుబాచర్లలో విద్యుదాఘాతానికి గురై.. వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఉంగుటూరు మండలం గోపాలపురానికి చెందిన బిక్కిన ప్రసాద్ వ్యవసాయ కూలి పనులు చేస్తుంటాడు. దూబచర్లలోని ఓ రైతు తోటలో ఆయిల్​ఫామ్ గెలలు నరికేందుకు కూలి పనికి వెళ్లాడు. ఇనుప గెడ కత్తితో గెలలు నరికే క్రమంలో.. పైన ఉన్న విద్యుత్ తీగలకు తాకింది. విద్యుదాఘాతంతో ప్రసాద్​ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు.. చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details