తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి వద్ద పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కపిలేశ్వరపురం మండలం కేదార్ లంక నుంచి అమలాపురానికి ఇటుకల లోడుతో వెళ్తున్న రెండు ట్రాక్టర్లు.. పొగమంచు కారణంగా అదుపుతప్పాయి. ఓ ట్రాక్టర్ ప్రధాన కాలువలోకి దూసుకుపోగా.. మరో ట్రాక్టర్ పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.
విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.