పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో ఓ యువకుడు విద్యూదాఘాతంతో మృతి చెందాడు. అత్తిలి శివారులోని బొంతువారి పాలెంలో పాత వైర్లను తొలగించి.. కొత్తగా 11 కేవీ విద్యుత్ వైర్లను ఏర్పాటు చేస్తుండగా కట్ట నాగరాజు అనే యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. ఇతను విద్యుత్ శాఖలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. యువకుని మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అత్తిలిలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి - కరెంట్ షాక్ కొట్టి అత్తిలిలో యువకుడు మృతి
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న యువకుడు కొత్త వైర్లను స్తంభంపై ఏర్పాటు చేస్తోన్న సమయంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో చోటు చేసుకుంది.
అత్తిలిలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి