పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రైలు ఇంజన్‌పై దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ ఇంజన్ మీదకు గుర్తు తెలియని వ్యక్తి అమాంతంగా దూకాడు. దీనితో విద్యుత్ సరఫరా చేసే తీగల్లో చిక్కుకుపోయాడు. వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తీగల మధ్యలో వ్యక్తి చిక్కుకున్న కారణంగా... రైలు ఇంజన్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయం గ్రహించిన లోకో పైలట్ విద్యుత్ తీగల్లో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీశారు. అప్పటికే అతను చనిపోయాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలుపై దూకి వ్యక్తి ఆత్మహత్య - atma hatya
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తిరుమల ఎక్స్‌ప్రెస్ మీదకు దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుత్ తీగల్లో చిక్కుకుని అక్కడికక్కడే మరణించాడు.
తిరుమల ఎక్స్‌ప్రెస్ మీదకు దూకి వ్యక్తి ఆత్మహత్య