ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యను చంపేసి సహజ మృతిగా నమ్మించాడు... ఏడాది తర్వాత దొరికిపోయాడు - ఏలూరు నేరవార్తలు

భార్యతో ఉన్న గొడవలతో ఆమెను హత్యచేసి.. సాధారణ మరణంలా చిత్రీకరించాడు.. బంధుమిత్రులను నమ్మించడమే కాకుండా.. పోలీసులను తప్పుదోవపట్టించాడు. ఏడాది తర్వాత అసలు విషయం వెలుగుచూసి అరెస్టు అయ్యాడు.

భార్యను హత్య చేసిన కేసులో నిందితుడి అరెస్టు
భార్యను హత్య చేసిన కేసులో నిందితుడి అరెస్టు

By

Published : Jan 17, 2020, 6:44 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పెదపాడులో దంపతుల మధ్య వివాదంతో భార్యను భర్తే హత్యచేశాడు. దాన్ని ఓ సాధారణ మరణంలో చిత్రీకరించాడు. ఈ ఘటన సంవత్సరం కిందట జరిగింది.

ఘంటసాల చంటి, ఉదయ్ కుమార్ భార్యభర్తలు. వీరి మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి. ఈ వివాదంలో భార్యను ఉదయ్ చంపేశాడు. అనంతరం సాధారణ మరణంలా చిత్రీకరించాడు. బంధువులను నమ్మించాడు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ఏడాది పాటు విచారించి ఘంటసాల చంటిని నిందితుడిగా తేల్చారు. ఆమెతో ఉన్న గొడవల కారణంగానే హత్య చేసినట్టు నిర్దరించారు. నిందితుడిని ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు.

భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్టు

ఇవీ చదవండి

చింతంపల్లిలో కోళ్ల బరి.... యువకుల ఢీ

ABOUT THE AUTHOR

...view details