పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రేమ పేరుతో.. యువతిని మోసం చేసి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరుకు చెందిన సౌజన్య అనే యువతి నాలుగు రోజుల కిందట.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు ఏలూరుకు చెందిన సింహాద్రి బాలచందర్ కారణమని యువతి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.
హైదరాబాద్లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసిన మృతురాలు సౌజన్యకు ప్రేమ పేరుతో సింహాద్రి బాలచందర్ దగ్గరయ్యాడు. చివరికి పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ముఖం చాటేశాడు. మనస్థాపం చెందిన సౌజన్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని డీఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడించారు. బాలచందర్ ను అరెస్ట్ చేశామన్నారు.