పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలంలో దొంగతనం నెపంతో ఇద్దరు దళిత యువకులను కట్టేసి కొట్టడాన్ని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ తీవ్రంగా ఖండించారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బాధితులను మాల మహానాడు నాయకుల బృందం పరామర్శించింది. వైకాపా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో దళితులపై అనేక దాడులు జరిగాయని ఆరోపించారు. యువకులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'వైకాపా అధికారంలోకి వచ్చాకే దళితులపై దాడులు పెరిగాయి' - లింగపాలెం వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెంలో దొంగతనానికి పాల్పడ్డారని ఇద్దరు దళిత యువకులపై దాడి చేయడాన్ని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు.
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్