పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన వలస కూలీలు ఆందోళనకు దిగారు. సుమారు 150 మంది వలస కూలీలు తమను వారి స్వస్థలాలకు పంపాలని నిరసన చేపట్టారు. నాలుగు నెలల క్రితం పనుల నిమిత్తం ఉత్తరప్రదేశ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వీరు లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయారు. గత 15 రోజులుగా తాడేపల్లిగూడెం ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తిండి లేక, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని విచారం వ్యక్తం చేశారు.తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ బాధితులు కోరుతున్నారు.
తాడేపల్లిగూడం తహసీల్దార్ కార్యాలయం వద్ద వలస కూలీల ధర్నా - పశ్చిమ గోదవరి జిల్లాలో వలస కూలీల కష్టాలు
పశ్చిమ గోదవరి జిల్లా తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద వలస కార్మికులు ధర్నా చేపట్టారు. తమను స్వస్థలాలకు పంపాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లిగూడం తహసీల్దార్ కార్యలయం వద్ద వలస కూలీల ధర్నా