పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో వాసవి అమ్మవారి మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. వాడవాడలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు పూజల్లో పాల్గొన్నారు. రాజగోపుర విమాన స్థూపిక కలశములకు వేదమంత్రాల నడుమ మంత్రులు మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా మహా పూర్ణాహుతి, శ్రీ చండీహోమం శోభాయమానంగా జరిపించారు. అమ్మవారి వైభవాన్ని తిలకించడానికి భక్తులు పోటెత్తారు.
పెనుగొండలో వాసవి అమ్మవారి మహాకుంభాభిషేకం - పెనుగొండలో వాసవి అమ్మవారి మహాకుంభాభిషేకం
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రం వాసవి అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేక కార్యక్రమం వైభవంగా జరిగింది.
![పెనుగొండలో వాసవి అమ్మవారి మహాకుంభాభిషేకం maha kumbhabhishekam in penugonda vasavi temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6303047-137-6303047-1583398973526.jpg)
పెనుగొండ వాసవి అమ్మవారి ఆలయం