పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని ఎల్బీచర్ల తదితర గ్రామాల్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన వరి, ఉద్యావన, ఆక్వా చెరువులను మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పరిశీలించారు.
సమస్యలు పక్కనబెట్టి..
వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి తమ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో పర్యటించకుండా అమరావతిలో కూర్చుని తనపై ఉన్న కేసులు మాఫీ చేయించుకునేందుకు కృషి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
సర్కారే కొనుగోలు చేయాలి..
ఇప్పటికైనా జిల్లాల్లో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డమాండ్ చేశారు. భారీ వర్షంతో నష్టపోయిన వరి, కూరగాయ పంటల రైతులను ఆదుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు సర్కారే కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు బండారు పటేల్, రాజ నాయుడు, కటకం చెట్టి పెద్ది రాజు, ఆనందరాజు, గుబ్బల వీరస్వామి, మాజీ ఎంపీటీసీ రాట్నాల, కటకంశెట్టి రఘు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఆడ బిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు ఎందుకు..?: పవన్