MA Shariff Comments: మాజీ శాసనమండలి ఛైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి పాలన సాగిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో నిర్వహించిన గౌరవ సభలో పాల్గొన్న ఆయన... జగన్ ప్రభుత్వ పాలనా విధానంపై మండిపడ్డారు. రాష్ట్రంలో బిహార్ తరహా పరిస్థితులు నెలకొన్నాయని.., సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
MA Shariff: వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలతో తెదేపా పొత్తు: ఎంఏ షరీఫ్ - జనసేన తెదేపా కూటమిపై షరీప్ కామెంట్స్
MA Shariff Comments: మాజీ శాసనమండలి ఛైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెదేపా, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలతో తెదేపా పొత్తు
ఏపీలో భద్రతతో కూడిన ప్రశాంతమైన పాలన కొనసాగాలంటే తెదేపా తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనసేన, వామపక్షాలతో తెదేపా పొత్తుపై షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఇదీ చదవండి: Case Against YSRCP Counsellor: హిందూపురంలో వైకాపా కౌన్సిలర్‌పై కేసు