లారీ బ్యాటరీ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగటంతో వాహనం దగ్ధమైంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో జరిగింది.
ఎలా జరిగింది..
లారీ బ్యాటరీ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగటంతో వాహనం దగ్ధమైంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో జరిగింది.
ఎలా జరిగింది..
పట్టణానికి చెందిన కల్యాణ్.. తన లారీలో ద్రాక్ష పండ్ల లోడ్‌తో బ్రహ్మానంద రెడ్డి మార్కెట్‌కి వెళ్లాడు. పండ్లను వాహనం నుంచి దించుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. పక్కనే ఉన్న డీజిల్ ట్యాంకుకు మంటలు వ్యాపించటంతో నిమిషాల్లో లారీ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు 15 లక్షల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణాలు కాపాడుతోంది... ప్రైవేటీకరణ వద్దు'