ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి - జంగారెడ్డిగూడెంలో లారీ డ్రైవర్ మృతి వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ లారీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మద్యం మత్తులో లారీపై నుంచి పడి చనిపోయినట్లు సాక్షులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

lorry driver died
లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి

By

Published : Oct 25, 2020, 7:33 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ లారీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడేనికి చెందిన దాసరి ఎలమంద ఆర్​అండ్​ఆర్ పనుల్లో లారీ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా తోటి డ్రైవర్లు, క్లీనర్లతో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో లారీపై నుంచి పడి చనిపోయినట్లు అక్కడ ఉన్నవారు చెప్పారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details