ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిడదవోలులో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి - నిడదవోలులో రోడ్డు ప్రమాదం వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ద్విచక్రవాహనదారుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

lorry byke accident one person death at westgodavari district
నిడదవోలులో రోడ్డు ప్రమాదం...ఓ వ్యక్తి మృతి

By

Published : Oct 10, 2020, 8:05 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడిక్కడే మృతి చెందాడు. నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే దారిలో ఉన్న రైల్వే గేట్​ వద్ద బియ్యం లోడుతో వెళ్తున్న లారీ వెనుక ద్విచక్రవాహనదారుడు వెళ్తున్నాడు.

లారీ అదుపుతప్పి వెనక్కి వచ్చింది. వెనుక ఉన్న ద్విచక్రవాహనాన్ని లారీ బలంగా ఢీ కొట్టింది. వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు శెట్టిపేట గ్రామానికి చెందిన యల్లమిల్లి రాజేష్​గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 5,653 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details