ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్న తిరుపతికి.. కాలినడక వెళ్తోన్న భక్తులపై దూసుకెళ్లిన లారీ - lorry accident at pippara

పశ్చిమ గోదావరి జిల్లా పిప్పర శివారులో భక్తులపైకి లారీ దూసుకెళ్లింది. వీరవాసరం నుంచి ద్వారకా తిరుమల నడకదారిలో వెళ్తున్న భక్తులను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దారిలోనే ఒక మహిళ మృతి చెందింది.

చిన్న తిరుపతికి కాలినడక వెళ్తోన్న భక్తులపైకి దూసుకెళ్లిన లారీ

By

Published : Sep 26, 2019, 11:27 PM IST

చిన్న తిరుపతికి కాలినడక వెళ్తోన్న భక్తులపైకి దూసుకెళ్లిన లారీ

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ప్రాంతానికి చెందిన సుమారు 45 మంది భక్తులు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు. పిప్పర శివారులో... రహదారి పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న వీరి మీదకు లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. అంబులెన్స్ ఎంతకూ రాని కారణంగా.. క్షతగాత్రులను బొలేరో వాహనంలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో ఆసుపత్రికి చేరేలోపే దుర్గ (45) అనే మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని భక్తులు రహదారిపై నిలిపి ఆందోళన చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details