పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులో పంట కాలువలో లారీ బోల్తాపడింది. కాపవరం నుంచి నారాయణపురం వెళ్తున్న చేపల లోడు లారీ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి వంతెన పైనుంచి కాలువలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో ఎనిమిది మంది కూలీలతో పాటు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. ప్రమాదంలో ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం గ్రామానికి చెందిన ఇంజేటి రాజు కు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న గణపవరం సి ఐ భగవాన్ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లిన లారీ
పశ్చిమగోదావరి జిల్లా మందలపర్రులో లారీ బోల్తా పడింది.ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
మందలపర్రు లో లారీ బోల్తా..
ఇదీ చూడండి:పోలవరం కుడి కాలువలో ఏడాదిన్నర బాలిక మృతదేహం