రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: లోకేశ్ - visit
గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో నారా లోకేశ్ పర్యటించారు. వరద పరిస్థితిని పరిశీలించారు. రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్,పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బృందం...గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించింది.పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని కోడేరులో వశిష్ట గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు.అనంతరం వేమవరంలో నీటమునిగిన పంట పొలాలు పరిశీలించారు.రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.పంటలు నీట మునిగినా...దీనిపై ప్రభుత్వం ఇంతవరకూ పట్టించుకోలేదని రైతులు తెలిపారు.రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని లోకేశ్ అన్నారు.