వైకాపా ప్రభుత్వం కావాలనే తెదేపా నేతలపై కేసులు పెడుతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో లోకేశ్ మీడియాతో మాట్లాడారు. తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌పై 4 రోజుల్లో 12 కేసులు పెట్టారన్నారు. 600 మంది కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో హోంశాఖ పనిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ఎన్హెచ్ఆర్సీ రావాల్సిన పరిస్థితిని సీఎం జగన్ కల్పించారని ధ్వజమెత్తారు. చింతమనేనికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
కక్షతోనే తెదేపా నేతలపై కేసులు పెడుతున్నారు: లోకేశ్
వైకాపా ప్రభుత్వం కావాలనే తెదేపా నేతలపై కేసులు పెడుతోందని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. 600 మంది తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారా లోకేశ్