ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాగంటి బాబుకి లోకేష్ ఫోన్... రాంజీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా

ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబుని నారా లోకేష్.. ఫోన్​లో పరామర్శించారు. మాగంటి పెద్ద కుమారుడు అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో.. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

lokesh phone to ex mp maganti
మాగంటి బాబుకి లోకేష్ ఫోన్

By

Published : Mar 4, 2021, 12:35 PM IST

ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబుని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్​లో పరామర్శించారు. మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ.. అస్వస్థతకు గురి కావటంతో.. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాంజీ త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు లోకేష్ తెలిపారు.

మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు.. రాంజీ అస్వస్థతో.. విజయవాడలోని హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్రా ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి:దుర్గమ్మ చెంతన... అయినవారిదే రాజ్యం!

ABOUT THE AUTHOR

...view details