పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై... ముగ్గురు ఎంపీలకు లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది. నరసాపురం ఎంపీ రఘురామతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు ఆ పార్టీ ఎంపీలు సిసిర్ అధికారి, సునీల్ కుమార్ మండల్‌కు నోటీసులు అందాయి.
Loksabha Secretariat Notice: ఎంపీ రఘురామకు లోక్‌సభ సచివాలయం నోటీసులు - Lok Sabha Secretariat sent notices to MP Raghurama
ఎంపీ రఘురామకు లోక్‌సభ సచివాలయం నోటీసులు
21:14 July 15
ముగ్గురు ఎంపీలకు లోక్‌సభ సచివాలయం నుంచి నోటీసులు
రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైకాపా ఎంపీల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల స్పీకర్‌ను కలిసిన వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి... ఫిర్యాదుకు అదనపు సమాచారం జోడించి ఇచ్చారు. వాటిని పరిగణలోనికి తీసుకున్న లోక్‌సభ సచివాలయం 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని రఘురామకు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి:
Last Updated : Jul 15, 2021, 9:48 PM IST