పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం తూర్ల లక్ష్మీ పురం గ్రామంలో మిడతల దండు ప్రభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిడతల దండు చుట్టుపక్కల ఉన్న జిల్లేడు చెట్ల ఆకులను తింటున్నాయి. ఇది గమనించిన స్థానికులు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జిల్లేడు చెట్లను తింటున్న మిడతల దండు పంటలపై పడి వాటి ప్రభావం చూపిస్తే... తీవ్ర నష్టం కలిగి కరువుకాటకాలు వాటిల్లుతాయని వాపోతున్నారు. ఇలా జరగక ముందే అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
జిల్లేడు ఆకులను తినేస్తున్నాయ్..!! - మిడతలు తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా తూర్ల లక్ష్మీపురంలో... మిడతల దండు ఉనికితో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిడతల దండు ప్రభావంతో గ్రామంలో జిల్లేడు చెట్లకు ఆకులు కనిపంచటం లేదు. అధికారులు సకాలంలో స్పందించి మిడతలను తరిమికొట్టే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
పశ్చిమగోదావరిలో మిడతల ప్రభావం