పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, చుట్టు పక్కల గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. తణుకులో ఉదయం 11 గంటల వరకే దుకాణాలు తెరుచుకోవటానికి అనుమతించారు. ప్రజలు ఈ సమయాల్లో భారీగా సంఖ్యలో రోడ్ల మీదకి వస్తున్నారు.
నరేంద్ర కూడలి నుంచి జిల్లా కేంద్ర ఆసుపత్రి వరకు అడుగుతీసి అడుగు వేయలేనంతగా ప్రజలు సంచరించారు. రద్దీని తగ్గించడానికి అధికారులు ఆంక్షలు పెంచారు. ప్రధాన రహదారుల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.