కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేశారు. పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు దుకాణాలు మూసివేయించారు. కేవలం పాలకేంద్రాలు, ఔషధ దుకణాలకు మాత్రమే వెసులుబాటు కల్పించారు. అత్యవసరమైతే తప్ప ఎవరిని పట్టణంలోకి అనుమతించటంలేదు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి పోలీసులు విజ్జప్తి చేస్తున్నారు.
తణుకులో పటిష్ఠంగా లాక్డౌన్ అమలు - తణుకులో లాక్డౌన్ నిబంధనలు
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో లాక్డౌన్ నిబంధనలను అధికారులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరిని పట్టణంలోకి అనుమతించటంలేదు.
తణుకులో పటిష్ఠంగా లాక్డౌన్ నిబంధనలు