కరోనా కాలం: లాక్డౌన్ నిబంధనలు కఠినతరం - covid news in tanuku
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో...పశ్చిమగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఆదివారం మాత్రమే పూర్తిగా బంద్ చేసేవారు. ఇప్పటినుంచి ఆదివారంతో పాటు మంగళ, శుక్ర వారాలలో కూడా లాక్ డౌన్ అమలుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తణుకులో లాక్డౌన్ పటిష్టం
కరోనా వైరస్ నివారణ చర్యలలో భాగంగా... పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, అత్తిలి ఇరగవరంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేశారు. ఆదివారంతో పాటు మంగళ, శుక్రవారాల్లో లాక్ డౌన్ అమలుకు ఆదేశించారు.
అధికారుల ఆదేశాల మేరకు పాల కేంద్రాలు, ఔషధ దుకాణాలు మినహాయించి మిగిలిన అన్ని దుకాణాలు మూతపడ్డాయి. తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.