పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో కరోనా పంజా విసురుతుండటంతో పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నగరంలో రేపటి నుంచి మళ్లీ లాక్డౌన్ అమలుకానుంది. ఉదయం 6గంటల నుంచి 11గంటల వరకు మాత్రమే సడలింపు ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు నిత్యావసరాలు, కూరగాయాలు కొనుగోలుకు అనుమతిస్తారు. మిగతా సమయంలో ప్రజల రాకపోకలను సైతం నిషేధించారు. కర్మాగారాలు, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాలు, హాటళ్లు, మార్కెట్లు మూతపడనున్నాయి. వైద్యసౌకర్యాలు ఇతర అత్యవసరమైన వాటికి మాత్రం అనుమతిస్తున్నారు. జిల్లాలో 20రోజుల్లోనే కరోనా తీవ్రస్థాయిలో విజృంభించింది. జిల్లాలో 635కేసులు నమోదుకాగా.. ఇందులో 262 ఏలూరులో నమోదవ్వటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఏలూరులో పెరుగుతున్న కరోనా కేసులు... లాక్డౌన్ దిశగా చర్యలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రేపటి నుంచి ఏలూరులో లాక్డౌన్ను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6నుంచి 11 గంటల వరకే నిత్యావసరాలకు అనుమతులు ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏలూరులో లాక్డౌన్